WhatsApp Group Join Now
Telegram Channel Join Now

School Holidays: Tomorrow is a holiday for schools.. this is the reason!

Children’s Day Celebrations on 14th November

Every year on November 14, India celebrates Children’s Day in honor of Jawaharlal Nehru’s birthday. This year, the government has declared a holiday for all schools on November 14 to mark the occasion. Nehru, affectionately known as Chacha Nehru, shared a special bond with children, and the Indian Postal Department releases postal bills on this day.

Changes in Diwali Holidays

The Central Election Commission initially granted a holiday for Diwali on Sunday (November 12), but on Monday (November 13), they rejected the state government’s proposal to cancel the Diwali holiday. Meetings and training classes proceeded as scheduled. Although Telangana declared Monday a holiday, the Central Election Commission insisted on maintaining the schedule.

Meanwhile, Andhra Pradesh declared a Diwali holiday on Monday, providing schools with a day off. Telangana initially announced Sunday, November 12, as a holiday, but later changed it to Monday based on suggestions from pundits. Despite the government’s adjustments, educational institutions and government offices ultimately received three consecutive days off due to changes linked to the Telangana elections.

Students attended school on Monday, only to have Tuesday off for Children’s Day. Normal classes resumed on Wednesday.

ప్రతీయేట భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది కూడా నవంబర్‌ 14వ తేదీని బాలల దినోత్సవంగా సర్కార్‌ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాగా మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాం. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ రోజున బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి యేట నవంబర్‌ 14వ తేదీన తపాలా బిళ్ళను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే.

దీపావళి సెలవుల్లోనూ మార్పులు.. ఇదీ కారణం

దీపావళి పండుగకు ఆదివారం (నవంబర్‌ 12) సెలవు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం, నవంబర్ 13 (సోమవారం)వ తేదీన మాత్రం దీపావళి సెలవు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం 13న వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణ తరగతులు జరుగుతాయి. ఒకవేళ సోమవారం సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు సజావుగా నిర్వహించలేమని భావించింది. అందుకే ఈ రోజు సెలవు దినంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర ప్రభుత్వం సోమవారం దీపావళి సెలవు ప్రకటించినప్పటికీ ఈ రోజు పాఠశాలలకు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం ప్రకటించిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెలవులను గతేడాది చివర్లో విడుదల చేసింది. ఆ ప్రకారంగా తొలుత నవంబర్ 12వ తేదీ ఆదివారం సెలవు ప్రకటించింది. తాజాగా పండితులు దీపావళిని నవంబర్ 13న జరుపుకోవాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవు దినాన్ని ఈరోజుకు మార్పు చేసింది. దీంతో నవంబర్ 13వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా. కానీ తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి.

నవంబర్ 11వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం, సోమవారం సర్కార్ ప్రకటించిన దీపావళి సెలవుతో కలుపుకుని మూడు రోజులు సెలవు ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం 13న ఇచ్చిన సెలవుదినాన్ని కేంద్రం ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు సోమవారం పాఠశాలలకు వెళ్లారు. ఇక మంగళవారం నవంబర్ 14 బాలల దినోత్సవం కారణంగా మరో సెలవు వచ్చింది. బుధవారం నుంచి స్కూళ్లకు యధావిధిగా తరగతులు జరుగుతాయి.

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Share This Article

Leave a Comment