WhatsApp Group Join Now
Telegram Channel Join Now

Aadhaar’s Shocking Move: The Unsettling Impact on Welfare Schemes

ఆధార్‌ జారీ సంస్థ ఆదేశాలపై విస్మయం

ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పరిధిలో కొన్ని పథకాలకు ధ్రువీకరణకు వీలుగా ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. ప్రత్యేకించి నిరక్షరాస్యుల అత్యధికుల్లో ఈ పద్ధతి ద్వారానే పుట్టిన తేదీని గుర్తించేవారు. ఆధార్‌ సంస్థ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా ఐదు రోజుల క్రితం ఒక కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయ ప్రభావం వేలాది మందిపై పడనుంది.

ఇదికాస్తా పేద వర్గాలకు శరాఘాతమే కాబోతుంది. చాలా కాలం నుంచి మనకు ఏది కావాలన్నా ఆధార్‌ కార్డు ను గుర్తింపుగా పరిగణనలోకి తీసుకుంటు న్నారు. వృద్ధాప్య పింఛన్‌కైనా, వితంతువులకు ఆర్థిక సాయం చేయడానికైనా, చంటి పిల్లలను హాస్పటల్‌ చేర్పించినా ఈ కార్డు ఆధార మైంది. ఆధార్‌తోనే మిగతా కార్డులన్నీ, అకౌంట్‌లన్నీ లింక్‌ అవుతూ వచ్చాయి. ఇలాంటి సమయంలోనే ఆధార్‌లో ‘పుట్టిన తేదీ’ ఇక ముందు చెల్లదంటూ ఆధార్‌ జారీ సంస్థ ఐదు రోజుల క్రితం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్య అమలు తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటిం చింది.

వాస్తవానికి ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీకి సంబం ధించి ఇంతకు ముందే కొంత గందర గోళం ఉంది. అయినా కూడా పుట్టిన తేదీ సక్రమమే అని ఆధార్‌లో గుర్తించడానికి గెజిటెడ్‌ ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకునేవారు. లేకుంటే నోటరీ పద్ధతిలో కొందరు ధ్రువీకరణకు ప్రయత్నించేవారు. కాని ఆకస్మికంగా ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీ ఇక చెల్లదన్నట్టుగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొందరిలో గుబులు రేపుతోంది. ఇక ముందు ఆధార్‌ అనేది ‘గుర్తింపు రుజువు’ మాత్రమే. ‘పౌరసత్వం, పుట్టిన తేదీకి కానేకాదు’ అంటూ తాజాగా జారీ చేస్తున్న ఆధార్‌ కార్డులపై ముద్రించడం విశేషం.

కొన్నేళ్ళ క్రితం వరకు ఆధార్‌లో సన్‌ ఆఫ్‌, డాటర్‌ఆఫ్‌, వైఫ్‌ ఆఫ్‌ అనే బంధుత్వం కూడా ఉండేది. రెండేళ్ల క్రితమే ఈ పదాలన్నిం టినీ తొలగించి అప్పటి నుంచి కేరాఫ్‌ అంటూ ప్రచురిస్తు న్నారు. ఇప్పుడు తిరిగి ఇకముందు ఆధార్‌ కార్డులో నమోదై ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోబోమని, ఇది ఏమాత్రం చెల్లబోదని ప్రకటించడం ఒకింత విస్మయానికి గురి చేస్తోంది.

సంక్షేమ పథకాలపై క్రీ నీడ

సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుని ఆయా కుటుం బాల అర్హతను గుర్తిస్తూ వచ్చాయి. ఉదాహరణకు కొన్ని ఇలా ఉన్నాయి.. 45 ఏళ్లు దాటితేనే మహిళలకు చేయూత కింద రుణం, 35 ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత, 60 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్‌, 60 ఏళ్లు దాటిన వారికి బీమా సౌకర్యం కల్పిస్తూ వస్తున్నారు. వీటన్నింటిలో పుట్టిన తేదీని ఆయా వ్యక్తుల ఆధార్‌ కార్డుల్లో నమోదైన తేదీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. గిరిజన తెగలకు చెందిన వ్యక్తులకు వృద్ధాప్య పింఛన్‌ అందించాలంటే 50 ఏళ్లు నిండితే చాలు ఇక్కడ కూడా ఆధారే ఆధారం.

ఇలాంటి కీలక నిర్ణయాలు, పేద వర్గాలకు చెందిన లబ్ధిదారుల ఎంపికలో ఓ గుర్తింపుగా ఉన్న పుట్టిన తేదీకి చెక్‌ పెట్టారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే కాకుండా తక్షణం అమలులో పెట్టారు. ఇప్పుడు తాజాగా నమోదవుతున్న ఆధార్‌ కార్డులన్నింటిలోనూ ఈ విషయం ప్రచురించి జారీ చేస్తున్నారు. ఇంకోవైపు ఏ ఏడాదికాయేడాది సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకాల కింద లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా ఇప్పుడు పుట్టిన తేదీ కూడా ఓ సమస్యగా మారడంతో ఇక ముందది పేదల మెడకు చుట్టుకోబోతుంది. ఫలితంగా వేలాది మంది సంక్షేమ పథకాలకు పూర్తిగా దూరమవుతారని భావిస్తున్నారు.

Introduction:
In a surprising turn of events, the Unique Identification Authority of India, responsible for Aadhaar cards, has recently made a decision that could have far-reaching consequences. Until now, the recorded date of birth on Aadhaar cards has been a fundamental element for verifying eligibility in various government and non-government schemes, particularly among illiterate individuals. This sudden shift, announced just five days ago, is poised to affect thousands and poses a significant concern for the welfare of the underprivileged.

The Role of Aadhaar:
Aadhaar, a document long regarded as a universal identity tool, has served as the linchpin for numerous essential services. From being the foundation for old age pensions to offering financial assistance to widows and even facilitating hospitalization for disabled children, Aadhaar has played a pivotal role in shaping social welfare initiatives. Additionally, it has been the central point linking various other cards and accounts.

The Decision and Its Immediate Impact:
The recent decision by the Aadhaar Issuing Organization to declare the ‘date of birth’ in Aadhaar invalid has sent shockwaves through the community. While previous confusion surrounding Aadhaar’s recorded birthdates was often resolved through gazetted verification or notarization, this unexpected move raises eyebrows. The fact that the decision was implemented immediately adds to the urgency and concern surrounding this development.

Evolution of Aadhaar:
Over the years, Aadhaar has undergone significant changes. Formerly seen as just a ‘proof of identity,’ the newer cards explicitly state, ‘Citizenship is not a matter of date of birth.’ The removal of familial relationships (Son of, Daughter of, Wife of) two years ago marked another shift in its identity. Now, the recent announcement that the recorded date of birth will no longer be considered standard is causing shock and concern.

Impact on Welfare Schemes:
Welfare schemes, vital for the well-being of many, have long relied on Aadhaar’s recorded birthdates for eligibility confirmation. Loans for women after 45 years, financial support for single women after 35 years, and old age pensions and insurance facilities after 60 years are just a few examples. The immediate implementation of this decision has cast a shadow on these schemes, potentially leaving thousands without the support they depend on.

Conclusion:
As the dust settles on this unexpected twist in Aadhaar’s narrative, the implications for welfare schemes become apparent. The immediate effects on the vulnerable communities that rely on these initiatives are a cause for concern. The coming days will likely reveal the extent of the impact on those who depend on these welfare schemes for their livelihoods, potentially leaving thousands without the support they need.

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Share This Article

Leave a Comment